బోరు మంజూరు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ఎర్రనర్సుపల్లెలో కురుమ సంఘానికి చెందిన బీరప్ప ఆలయానికి తాగునీటి సమస్యలతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో సంఘ సభ్యులు గురువారం సాయంత్రం కరీంనగర్లో బీజేపీ నేత బండి సంజయ్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఆయన ఆలయానికి బోరు మంజూరు చేశారు. సంఘ నాయకులు చుక్క రమేష్, తొత్తుల ఎల్లయ్య, కనకయ్య, బాలయ్య తదితరులు బండి సంజయ్ కి కృతజ్ఞతలు తెలిపారు.