కడప జిల్లా జమ్మలమడుగు లోని ముద్దనూరు రోడ్ లో ఫర్టిలైజర్ షాప్ ను శనివారం జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ ఆకస్మిక తనిఖి చేశారు. యూరియా కృతిమ కొరత సృష్టించి రైతులకు అధిక ధరలకు యూరియా ను విక్రయించిన తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే పాత మరియు ఎక్ష్పైరీ అయిన మందులను విక్రయించిన లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు. రైతులకు అపోహలు కలిగించి పంటలకు అధికంగా మందులు ఉపయోగించమని చెప్పి మోసగించవదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు తాహసిల్దార్ శ్రీనివాసరెడ్డి, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.