వాంకిడి మండలోని జైత్పూర్, బోర్డ గ్రామాల పత్తి పంటను కొమురం భీం అడ ప్రాజెక్ట్ 7 గేట్లు ఎత్తివేయడంతో ఆ వరద ప్రవాహానికి 20 రైతులకు చెందిన 40 ఎకరాల పత్తి పంట నష్టం జరిగిందని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దినకర్ అన్నారు. పంట నష్టం జరిగి వారం రోజులు గడుస్తున్నప్పటికీ వ్యవసాయ అధికారి రాలేదన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ జిల్లా వ్యవసాయ అధికారికి తక్షణమే సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.