దేశంలోని అన్ని రంగాల ప్రజలకు ప్రభుత్వం సమున్నత స్థానం కల్పించడమే బీజేపీ పార్టీ లక్ష్యమని ఆపార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలో వైఎస్సార్ చౌక్ దగ్గర జీఎస్టీ తగ్గింపుపై సంతోషం వ్యక్తం చేస్తు పీఎం నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గింపు వల్ల పేద మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు.