నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో వీధి కుక్కలు గ్రామస్తులపై దాడులు చేస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు శ్రేయస్(3), సర్వేష్ (5) చిన్నారులు కుక్కల దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి ఆరుబయట ఆడుకుంటుండగా కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. ఆలయానికి చెందిన ఆవులను సైతం కుక్కలు దాడి చేసి గాయపరచింది. గ్రామంలో ఇదే నెలలో రెండోసారి కుక్కలు దాడులు చేయడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.