శృంగవరపుకోట మండలం బొడ్డవర సమీపంలో జిందాల్ పరిశ్రమకు భూములిచ్చిన బాధిత రైతులకు మద్దత్తుగా ఎమ్మెల్సీ రఘురాజు శనివారం రాత్రి తన కార్యాలయంలో మాట్లాడారు. భూనిర్వాసితులు 62 రోజుల నుంచి మాకు అన్యాయం జరిగిందని ఎంత మందికి చెప్పినా అటు అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోవడం దురదృష్టమన్నారు. మా రైతుల తరుపున న్యాయం ఉందని కోర్టులో మాకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ అన్నారు. కలెక్టర్ మా ప్రజలు, రైతుల కోసం పనిచేయాలని కోరారు.