పల్నాడు జిల్లా,బెల్లంకొండ మండలం,రామాంజనేయపురం తండాలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మంగళవారం పర్యటించారు. ప్రజల విజ్ఞప్తి మేరకు పాఠశాలను ఏర్పాటు చేశారు. దీంతో ఆయన పాఠశాలను సందర్శించారు. అనంతరం రచ్చబండ కార్యక్రమాన్ని అధికారులతో కలిసి నిర్వహించారు. తండావాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.