ఓ మహిళా ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్తూ వెళ్తూ రోడ్డుపై చెత్త సంచి వేస్తున్న మహిళను పరిశుద్ధ కార్మికురాలు అడ్డుకొని నిలదీసింది. ప్రతిరోజు ఉదయాన్నే ఇంటి ఇంటికి చెత్త సేకరించే వాహనం వస్తున్నప్పటికీ, రోడ్డుపై చెత్త ఎందుకు పడేస్తున్నారు అని ఆ పారిశుద్ధ్య కార్మికురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం నెలకు ₹100 చెల్లించి చెత్త వాహనంలో వేయలేరా అని ఆమె ప్రశ్నించింది.