నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ సె బర్ 2న వై.యస్.రాజశేఖరరెడ్డి వర్ధంతినిపురస్కరించుకొని A4 డ్రాయింగ్ చార్టు మీద ఎటువంటి గీతలు లేకుండా మైక్రో పెన్నుతో క్రమబద్దంగా చుక్కలు పెట్టుకుంటూ వైస్సార్ పొట్రాయిట్ చిత్రాన్ని 4గంటల సమయంలో వేసి చిత్ర నివాళ్లు అర్పించారు. దీన్ని డ్రాయింగ్ డాట్ వర్క్ అని అంటారు.మంచి నాయకుడిగా పేరు గాంచారన్నారు. మంచి వ్యక్తిగా, ఎప్పుడూ నవ్వుతూ, నవిస్తూ అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల మనిషి గా అందరి హృదయాల్లో రాజన్న ఉంటాడు.వైస్సార్, జయంతి, వర్ధంతులకు వైస్సార్ చిత్రాలు వినూత్నంగా వేస్తూ చిత్రానివాళ్లు అర్చిస్తూ వుంటానని తెలిపారు.