కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో ప్రజల త్రాగునీటి అవసరాల కోసం NRI రాజేష్ కల్లేపల్లి సమకూర్చిన మంచినీటి పథకాన్ని గురువారం జబర్దస్త్ పేమ్ హైపర్ ఆది టీం చేతుల మీదుగా ప్రారంభించారు.గ్రామంలో ప్రజలు త్రాగునీటి కోసం దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు రూ.20 లక్షలు నిధులు సమకూర్చి త్రాగునీరు అందించేందుకు బోరును ఏర్పాటు చేసి ఏగులమ్మ తల్లి గుడి వద్ద ఉన్న వాటర్ ట్యాంకుకు అనుసంధానం చేశారు.