శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం, జమ్మూ లేఔట్ వద్ద నాకు పాములు విపరీతంగా సంచరిస్తున్నాయని స్థానికులు తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు రహదారిపై ఓ నాగుపాము జరిపోతూ సయ్యాటలాడటం కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గంటకు పైగా అవి రహదారి పైనే ఉండడంతో అటుగా వెళ్లడానికి ప్రజలు భయపడ్డారు.. రాత్రి వేళల్లో మరింత భయంగా ఉంటుందని దీనికి కారణం తుప్పలు పెరిగిపోవడమేనని వారు పేర్కొన్నారు..