ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొనే సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభ కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలోనగరంలోని అనంతపురం - బెంగుళూరు జాతీయ రహదారిలో టాటా మోటార్స్ ఎదురుగానున్న స్థలంలో ఏర్పాటు చేస్తున్న రెండు హెలిప్యాడ్ లలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా ఎస్పీ పి.జగదీష్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, సీఎం సెక్యూరిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.