పల్నాడు జిల్లా,నకరికల్లు మండలంలోని ఎరువులు, ఫర్టిలైజర్స్ నిల్వలు, విక్రయాలకు సంబంధించి బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ దేచవరం గ్రామంలో రెండు షాపులలో స్టాక్, రికార్డులు పరిశీలించడం జరిగిందన్నారు. డీలర్ల నుండి వివరాలు తీసుకోవడంతోపాటు రైతుల వద్ద నుండి ఎరువులకు సంబంధించిన సమాచారం సేకరించామన్నారు.అధిక ధరలపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు.