సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర గొప్పదని మండల విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ అన్నారు. అనంతరం వారు అలంపూర్ మండల కేంద్రంలోని మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.