కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని చింత కొమ్మ దిన్నె మండలంలో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. ఆదివారం చింతకొమ్మదిన్నె మండల కేంద్రం లోని జెడ్పి హైస్కూల్ ఆవరణలో అధునాతన వసతులతో నిర్మించిన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్ ను జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు.