ప్రభుత్వం వైద్య కళాశాలల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని (పీపీపీ విధానాన్ని) పూర్తిగా ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వమే వాటిని నిర్మించి నిర్వహించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి టి.శివరాం డిమాండ్ చేశారు. శనివారం డోన్లోని సీఐటీయూ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలన్నారు. ఇప్పటికే సాధారణ విద్యలో 50 శాతానికి పైగా ప్రైవేటుపరం అయిందని అన్నారు