జగిత్యాల రూరల్ పొలాస గ్రామంలోని సహస్ర లింగాల దేవాలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా బుధవారం ఉదయం 11 గంటలకు మహాగణపతికి ప్రత్యేక పూజలు..ఈ సందర్భంగా సంకటహర చతుర్థి సందర్భంగా ఆలయంలోని మహాగణపతికి పంచామృతాభిషేకాలను నిర్వహించి పలు పుష్పాలతో గరకతో స్వామి వారికి చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించి మంగళహారతులను సమర్పించారు. ఈ పూజాక్రతులను ఆలయ అర్చకులు నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు