అల్లూరి జిల్లా అరకులోయ మండలం పరిధిలో లోతేరు పంచాయతీ అడారి గ్రామంలో ఆదాని నవయుగ హైడ్రోపార్ ప్రాజెక్ట్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం నాయకులు ఆద్వర్యంలో పెద్ద ఎత్తున సోమవారం సాయంత్రం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన జీవో నెంబరు-51ను రద్దు చేయాలని డిమాండ్ చేసారు. ఈసందర్బంగా ఆడారి నుంచి లోతేరు వరకూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి ఆదానీ, నవయుగ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు.