కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ గ్రామం ప్రస్తుతం నగర పాలక సంస్థలో విలీనం అయ్యి డివిజన్ గా ఏర్పడింది. డివిజన్ గా పేరుకే ఏర్పడిందని సౌకర్యాలు ఏమాత్రం లేవని.. అధికారుల పట్టింపు అసలే లేదని డివిజన్ ప్రజలు మాజీ ప్రజా ప్రతినిధులు వాపోతున్నారు. డివిజన్ నుండి అన్నిరకాల టాక్స్ లు వసూలుచేస్తున్నారని.. కానీ వసతులు కల్పించడం గాలికి వదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దుర్శేడ్ స్మశానవాటికలో కనీస సౌకర్యాలు లేవని ఎన్నో సార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తున్న పట్టించుకున్న పాపాన పోలేదంటున్నారు. డివిజన్ వాసులు.. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు జరపడానికి నరక యాతన పడుతున్నామంటున్నారు.