ఎల్బీనగర్ లో ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం మెట్రో వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డిని బుధవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలను వివరించారు. ముఖ్యంగా మన్సురాబాద్, హయత్ నగర్ డివిజన్లో కొనసాగుతున్న ట్రంక్ లైన్ సమస్యలను వివరించారు. స్పందించిన మెట్రో వాటర్ బాక్స్ ఎండి అశోక్ రెడ్డి 15 రోజుల్లో చర్యలు చేపట్టి పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.