వేంపల్లి గ్రామపంచాయతీలో పారిశుద్ధ్యం పడకేసిందని పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ధ్రువ కుమార్ రెడ్డి అన్నారు. వేంపల్లి లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం వీధుల్లో పేరుకుపోయిందని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కూటమి నాయకులు కమిషన్ల కోసం కకృతి పడి పంచాయతీని గాలికి వదిలేశారని చెప్పారు. రెగ్యులర్ ఈవో లేక ఐదు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో వారు సమ్మె చేస్తున్నారని చెప్పారు. వెంటనే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించి వేంపల్లి పట్టణాన్ని శుభ్రం చేయాలని చెప్పారు.