విద్యార్థులు సమాజంలో జరుగుతున్న సైబర్ నేరల పట్ల అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా సౌత్ జోన్ డిఎస్పి భవ్య కిషోర్ అన్నారు. శనివారం రాజమండ్రిలో ఆమె విద్యార్థులతో మాట్లాడుతూ టెక్నాలజీని ఉపయోగించుకుని కొంతమంది వ్యక్తులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఫేక్ అకౌంట్ లతో బురిడీ కొట్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిచయం లేని వారితో సోషల్ మీడియాలో చాటింగ్ చేయవద్దని సూచించారు.