పల్నాడు జిల్లా,సత్తెనపల్లి మండలం కొమ్మెరపుడి విద్యుత్ సబ్ స్టేషన్ లో విధుల నుంచి తొలగించిన షిఫ్ట్ ఆపరేటర్లకు గురువారం వైసీపీ నేతలు మాజీ మంత్రి అంబటి రాంబాబు మద్దతు పలికారు.ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక పైసా కూడా ఆశించకుండా 34మంది షిఫ్ట్ ఆపరేటర్లను నియమించానని తెలిపారు.పాతవారిని తీసేసి,కొత్త వారిని నియమించేందుకు ఒక్కొక్కరి వద్ద 5 లక్షలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.19మంది దగ్గర 95లక్షలు తీసుకున్నారని నాకు ఉన్న సమాచారం వచ్చిందని,దీనిపై కన్నా లక్ష్మీనారాయణ సమాధానం చెప్పాలన్నారు.