కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల కారణంగా నేరడిగొండ మండలంలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీంతో 44వ నంబర్ జాతీయ రహదారిపై లారీలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున ఆ మార్గంలో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.