వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలకు పూజలు చేద్దామని ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతినబూనారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రంగులు రసాయనాలు వినియోగించి తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని నినదించారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మట్టి గణపతుల తయారీ చేశారు. ప్రకృతిని అమ్మలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందులో ప్రధానోపాధ్యాయులు మధుసూదన్, వ్యాయామ ఉపాధ్యాయుడు భూమన్న తదితరులు పాల్గొన్నారు.