దేశంలోనే గట్టు మండలం అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉండాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం గట్టు మండల కేంద్రంలో సంపూర్ణత అభియాన్ అవార్డు ప్రోగ్రాంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గట్టు మండలం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అన్ని రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచడానికి అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి కట్టుగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.