గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని సంజీవయ్య నగర్ రైల్వే గేటు వద్ద గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న త్రాగునీటి సరఫరా పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఇంటర్ కనెక్షన్ పనులు నిర్దేశిత గడువుకు ముందే పూర్తి చేసి త్రాగు నీటి సరఫరా యధావిధిగా ఇచ్చేందుకు ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ ఆదేశించారు. జరుగుతున్న పనులు వేగంగా జరిగేందుకు ఇంజనీరింగ్ అధికారులు పూర్తిస్థాయిలో పని ప్రాంతంలోనే ఉండి పర్యవేక్షించాలని సూచించారు.