కంబదూరు మండలం తిమ్మాపురం ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ మధుసూదన్ రావు నంద్యాల కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా శనివారం బ్యాంకు అధికారులు, సిబ్బంది, కస్టమర్లు, గ్రామస్తులు, వ్యాపారులు మధుసూదన్ రావు ను శాలువాలు, పూల మాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మేనేజర్ మధుసూదన్ రావు మాట్లాడారు. కస్టమర్లు, బ్యాంకు సిబ్బంది, గ్రామస్తులు విధి నిర్వహణలో తనకు ఎంతగానో సహకరించారన్నారు.