ఉపాధ్యాయులు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ నిరసన తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం సాయంత్రం నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏపీటీఎఫ్ పిలుపుమేరకు నిర్వహించిన ఈ నిరసనలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా APTF జిల్లా కార్యదర్శి గౌరీ శంకర్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్లక్ష్యాన్ని విడనాడి, ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయులపై బోధనేతర పని భారాన్ని తగ్గించాలని, ఐఆర్ ప్రకటించి, నూతన పిఆర్సి కమిషన్ను వేయాలని డిమాండ్ చేశారు.