హైదరాబాద్ జిల్లా గాంధీభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలు శుక్రవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు అమలు చేస్తుందన్నారు. 60 ఏళ్ల తెలంగాణను 15లలో కేసీఆర్ కుటుంబం దోచుకు తిన్నదని అన్నారు. ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేశారని అన్నారు.