శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక లారీ బీభత్సం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి ఒక లారీ ఒక హోండా యాక్టివాను ఢీ కొట్టి రెండు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్ళింది. గమనించిన యువకులు లారీని వెంబడించి పట్టుకొని డ్రైవర్ను కిందికి దించి పోలీసులకు అప్పచెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనను పరిశీలించారు. హోండా డైవర్ పై ఉన్న వ్యక్తి ఎవరో తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలి.