సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని వట్టపల్లి మండలం గౌతాపూర్ గ్రామంలో మంగళవారం సిపిఎం బృందం పర్యటించారు. ఈ సందర్భంగా ఏరియా కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ హంస చెరువు అలుగుకు కాల్వ తీయగా పంట చేనులోకి నీరు ప్రవహించడంతో తీవ్రంగా పంట నష్టపోయినట్లు రైతులకు తెలిపారని పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేల నష్టపరిహారం చెల్లించాలన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో అకాల వర్షాలతో పాటు చెరువుకు నాలుగు కాలువ తీయడంతో అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ముందస్తు చర్యలు చేపడితే ఇలాంటి పంట నష్టాలు జరిగేవి కావని తెలిపారు.