తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు రాష్ట్ర పగ్గాలు చేపట్టాక తొలిసారి కరీంనగర్ వస్తున్న సందర్భంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి బిజెపి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో పాటు కార్యకర్తలు అతనికి ఘన స్వాగతం పలికేందుకు తరలివచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి బిజెపి కార్యకర్తలు బుధవారం మధ్యాహ్నం అతనికి స్వాగతం పలికేందుకు గుండ్లపల్లి స్టేజి వద్దకు వచ్చారు. కరీంనగర్ జిల్లా పోలింగ్ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు తో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షు