జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి విలేఖరుల సమావేశంనిర్వహించారు.బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ను మేడిగడ్డ వద్ద కాకుండా తుమ్మడి హాట్టి వద్ద నిర్మిస్తే బాగుండేదనీ, మేడిగడ్డ వద్ద కట్టడం వలన సాంకేతిక లోపం ఏర్పడిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.కాలేశ్వరం ప్రాజెక్టును తుమ్మడి హాట్టి వద్ద నిర్మించడానికి వీలున్నా కూడా, బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, తప్పిదాల వలన మేడిగడ్డ వద్ద నిర్మించిందని విమర్శించారు. నేషనల్ డ్యాం అథారిటీ సేఫ్ కూడా బ్యారేజ్ ని మేడిగడ్డ...