కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని కలసపాడు మండలం కలసపాడుకు చెందిన వ్యక్తి ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మైదుకూరు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంను గుర్తు తెలియని వాహనం డీ కొనడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది.ఈ ప్రమాదంలో కలసపాడుకు చెందిన వ్యక్తి మృతి చెందగా, ద్విచక్ర వాహనం నుజ్జు నుజ్జు అయినది. ఈ ఘటనపై మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటనలో మృతుని వివరాలు ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి వుంది.