ప్రధాన రోడ్ల నిర్వహణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. మధురవాడ జోన్ లో జీవీఎంసీ చేపట్టనున్న ప్రధాన ప్రాజెక్టులపై ఇంజనీరింగ్ అధికారులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. పదేళ్ల పాటు రోడ్లు, ఫుట్ పాత్ లు, వీధిలైట్లు, గ్రీనరీ తదితరాలను నిర్వహించే కేరళ ప్రైవేట్ మోడల్ జీవీఎంసీలో అమలు చేయనున్న నేపథ్యంలో అత్యధికంగా రాకపోకలు సాగించే రోడ్లను గుర్తించాలన్నారు. జోన్ పరిధిలోని కొమ్మాది, పీఎం పాలెం డబుల్ రోడ్లు సహా కైలాసగిరి - తిమ్మాపురం, లా కాలేజీ - ఐటీ సెజ్, మిథిలాపురి లే అవుట్ - హరిత రహదారులపై మాట్లాడారు.