జిల్లా పరిధిలో వీధి కుక్కలను పట్టివేసి కుటుంబ నియంత్రణ చేయాలని సిడిఎంఏ అధికారిని డాక్టర్ సుజాత పేర్కొన్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎనిమల్ బర్త్ సెంటర్ నగరవాటిక నైట్ షెల్టర్ ను గురువారం మున్సిపల్ అధికారులతో కలిసి సి డి ఎంఎ అధికారిని డాక్టర్ సుజాత ఎస్ఎంసి మెప్మా అధికారి సందర్శించారు. నైట్ షెల్టర్ లను పరిశుభ్రంగా ఉంచాలని నగరవాటికకు సదుపాయాలు కల్పించాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.