ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం మండపంపై టపాసులు పడటంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లు కమిటీ వాళ్లు గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మండపాన్ని నిర్మించారు తొమ్మిది రోజుల కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం శనివారం విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు ఆ సమయంలో కాల్చిన టపాసులు మండపంపై పడటంతో ఒక్కసారిగా మండపంకు మంటలు అంటుకున్నాయి. మంటలు ఒకసారి ఎగిసిపడటంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు