పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామంలో రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. ప్రైవేటు దుకాణాల్లో గుళికలు కొంటేనే యూరియా ఇస్తామని నిబంధనలు పెడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పీఏసీఎస్ లకు యూరియా అందించాలని రైతులు కోరారు.యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఐదు పీఏసీఎస్ లు ఉన్నప్పటికీ యూరియా అందుబాటులో లేదని అన్నారు.