తన 15 సంవత్సరాల కుమారుడు శ్యామ్ కనిపించడం లేదని తండ్రి చింతమనేని మురళీకృష్ణ స్థానిక పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సీఐ గంగా వెంకటేశ్వర్లు గురువారం రాత్రి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుడు ఆచూకీ తెలిసినవారు పట్టాభిపురం పోలీసులకు సమాచారం అందించాలని ప్రకటనలో సీఐ కోరారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిన శ్యామ్ కనిపించడం లేదని తెలిపారు.