'అన్నదాత పోరు' పోస్టర్లను మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆవిష్కరించారు. శనివారం సాయంత్రం రొద్దం మండలం చినమంతూరు పంచాయతీలో రైతులతో కలిసి పోస్టర్లను విడుదల చేశారు. వైసీపీ రైతన్నలకు బాసటగా ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన 'అన్నదాత పోరు' కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రైతులకు మద్దతుగా పార్టీ శ్రేణులు కదలి రావాలని ఆమె పిలుపునిచ్చారు.