నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రతిష్టించిన బొజ్జ గణపయ్యకు ఎస్పీ జానకి షర్మిల శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బైంసా పట్టణంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని నిర్మల్ పట్టణంలో నిమజ్జన శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో జరుపకోవాలని కోరారు. అనంతరం సాంప్రదాయ బద్ధంగా శోభాయాత్రను ప్రారంభించారు. ఇందులో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఏఎస్పీ రాజేష్ మీనా, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.