ములుగు జిల్లాలో రైతులకు యూరియా కొరత ఉండటం ఇది కాంగ్రెస్ పార్టీ, మంత్రి సీతక్క వైఫల్యమే అని బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. నేడు ఆదివారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వం కారణం కాదని, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి గత మూడు నెలల నుండి యూరియా కొరత ఉందని చెప్పి ప్రచారం చేసి రైతులు ఆందోలన చెందే విధంగా చేసి, రైతులందరూ ఓకే సారి యూరియా కొరకు రోడ్ల పైకి రావడం జరిగిందని అన్నారు. డీలర్లు పెద్ద మొత్తంలో యూరియా నిల్వ