Araku Valley, Alluri Sitharama Raju | Aug 29, 2025
పెదబయలు పోలీసుల వాహన తనిఖీల్లో 65 కేజీలు గంజాయి పట్టుబడింది అని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై కే రమణ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని సీత గుంట పంచాయతీ రోగులుపేట వద్ద శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పట్టుపడ్డారని వారిద్దరిని అరెస్ట్ చేసి 65 కేజీలకు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రమణ తెలిపారు.