యాడికి మండలం ఓబులాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.తను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిందని మనస్తావంతో జయకృష్ణ (22) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకున్నప్పటికీ ఆదివారం వెలుగులోకి వచ్చింది. జయ కృష్ణ ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. విషయం తెలియడంతో జయకృష్ణ మనస్థాపం చెంది ఉరివేసుకొని తనువు చాలించాడు. ఈ ఘటనపై యాడికి సీఐ వీరన్న కేసు దర్యాప్తు చేపట్టారు.