25 మందికి రూ.37.28లక్షలు సీఎం సహాయనిధి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గురజాల జగన్ చిత్తూరు : వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న బాధితులకు అండగా నిలిచారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు. చిత్తూరు నియోజకవర్గ పరిధిలో 25 మంది లబ్ధిదారులకు రికార్డు స్థాయిలో రూ. 37. 28 లక్షలను పంపిణీ చేశారు. శుక్రవారం వారం సాయంత్రం చిత్తూరు బీవీ రెడ్డి కాలనీలోని ఎమ్మెల్యే వారి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు అర్బన్ 12 మంది, రూరల్ 8 మంది, గుడి