కప్తానుపాలెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొల్లూరు మండలం జువ్వలపాలెంకు చెందిన దైవసేవకులు జకరయ్య చల్లపల్లిలో పని నిమిత్తం వచ్చి ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. కోదాడకు చెందిన కారు రేపల్లె వైపు నుంచి వెళ్తున్నాయి. కారు, బైక్ బలంగా డీకొట్టుకోవటంతో తలకు బలమైన గాయాలై జకరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.