నంద్యాల జిల్లా గడివేముల, మిడుతూరు మండలాలలో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ శుక్రవారం ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ గ్రీన్కో సంస్థ వారు సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు భూమిని కావాలని కోరడం జరిగిందన్నారు దీంతో సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి గడివేముల మండలంలోని చనకపల్లి మిడుతూరు మండలంలోని నాగులటి గ్రామాల్లో దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆర్డిఓ తాసిల్దార్లతో కలిసి పరిశీలించారు