గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్మాణాలల్లో నాణ్యత పాటించాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తెలిపారు. శుక్రవారం మహా ముత్తారం మండలం బోర్లగూడెంలో 20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ, 12 లక్షలతో నిర్మించనున్న అంగన్ వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారు మూల ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామీణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ, అంగన్ వాడి కేంద్రాలు, పంచాయతీ భవనాలు వంటి ప్రజా సదుపాయాలను నిర్మిస్తున్నామని