బాలికపై అత్యాచారం ఘటనలో ఓ యువకుడికి 26 ఏళ్ల జైలు శిక్ష విధించిన ఘటన గురువారం చోటుచేసుకుంది.. తిరుపతి జిల్లా చిల్లకూరు తీపనూరుకు చెందిన కన్నా శ్రీనివాసులు మైనర్ బాలికపై కన్నేశాడు 2021 జూలై 14న బాలిక తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లారు ఒంటరిగా ఉన్న బాలికను శ్రీనివాసులు కిడ్నాప్ చేసి వరగలి క్రాస్ రోడ్ ప్రాంతంలో ఓ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు నేరం రుజువు కావడంతో అతనికి 26 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నెల్లూరు జడ్జి సుమ గురువారం తీర్పు ఇచ్చారు.